భారతదేశం, డిసెంబర్ 1 -- Mercury Transit: గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది మొత్తం అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, మాట మొదలైన వాటికి కారకుడు. బుధుడు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. అయితే డిసెంబర్ నెలలో బుధుడు ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఐదు సార్లు తన రాశి సంచారంలో మార్పు చేయబోతున్నాడు. బుధుడు సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

2025లో ఆఖరి నెల డిసెంబర్. ఈ నెలలో ఐదు సార్లు బుధ సంచారంలో మార్పు జరగబోతోంది. బుధుడు డిసెంబర్లో వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 6న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 10న బుధుడు అనూర...