భారతదేశం, అక్టోబర్ 7 -- మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు అమలును డిసెంబర్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశపై ముఖ్యమంత్రి సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలి దశకు రూ.5,641 కోట్లు అవసరమవుతాయని, ఇందులో 493 ఎకరాల భూమి అభివృద్ధి జరుగుతుందని గుర్తించారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా రుణాల ద్వారా, ఇతర వనరులతో నిధులు సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు రూ.4,100 కోట్లు విడుదల చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,541 కోట్లు అందిస్తుంది. మిగిలిన నిధులను ఆర్థిక సంస్థల ద్వారా సేకరించనున్నారు.

మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం నదిని శుభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడం, నీటి స్థిరమైన ప్రవాహాన్ని నిర్ధారించ...