భారతదేశం, సెప్టెంబర్ 8 -- అమరావతిలో అధికారుల కోసం గృహనిర్మాణ టవర్లు డిసెంబర్ 31 నాటికి సిద్ధంగా ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఫిబ్రవరి నాటికి ఇళ్లను అధికారులకు అప్పగించనున్నట్టుగా వెల్లడించారు. ఇటీవలి వరదల్లో రాజధాని నగరం మునిగిపోయిందని దుర్మార్గపు ప్రచారం చేసినందుకు వైసీపీపై విమర్శలు గుప్పించారు మంత్రి నారాయణ. రాజధాని అభివృద్ధిని అడ్డుకున్న వారిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.

అమరావతి పర్యటన సందర్భంగా నారాయణ నేలపాడులో గెజిటెడ్ అధికారుల కోసం టైప్-1, టైప్-2 ఇళ్ల నిర్మాణ స్థలాలను పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం, అనుబంధ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మిగిలిన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సీఆర్...