భారతదేశం, అక్టోబర్ 27 -- నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తోంది. నవంబర్ 3న వెనకబడిన తరగతులకు(బీసీ) 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు కేసును విచారించనుంది.

కోర్టు ఉపశమనం ఇస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించిందని సమాచారం. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు తుది విచారణ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో ప్రభుత్వం ఎదురుచూస్తొంది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా.. డిసెంబర్‌లో ఎన్నికలు పూర్...