భారతదేశం, జనవరి 1 -- తెలంగాణలో డిసెంబర్ 2025లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం అమ్మకాలు రూ.5,102 కోట్లకు చేరుకున్నాయి. గతంలో డిసెంబర్ 2023లో మద్యం అమ్మకాలు రూ.4,300 కోట్లు దాటాయి. ఇప్పుడు డిసెంబర్ 30న మాత్రమే మొత్తం మద్యం అమ్మకాలు రూ. 375 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2025 సంవత్సరంలో ఒకే రోజు జరిగిన అత్యధిక అమ్మకం.

2025 చివరి రోజు డిసెంబర్ 31న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల ద్వారా సాయంత్రం సమయానికే దాదాపు రూ. 350 కోట్లకుపైగా సంపాదించింది. డిసెంబర్ చివరి రెండు రోజుల మెుత్తం కలిపితే రూ.750 కోట్ల వరకు అమ్మకాలు ఉన్నాయి. 2023, 2024 డిసెంబర్‌తో పోలీస్తే.. ఈసారి 13 వందల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం...