భారతదేశం, నవంబర్ 6 -- ప్రతిరోజు ఉదయం షవర్ చేసుకున్న తర్వాత, కాస్త ఫ్రెష్‌గా ఉండేందుకు చాలామంది వెంటనే డియోడరెంట్ వాడతారు. అయితే, మనం పెద్దగా పట్టించుకోని ఈ అలవాటు నిజంగానే క్యాన్సర్‌కు దారితీస్తుందా? ఈ ప్రశ్న చాలామందిని కలవరపెడుతోంది. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురామ్ తన అక్టోబరు 28వ తేదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక అంశాలను వెల్లడించారు.

"సాధారణంగా మనం వాడే డియోడరెంట్లలో అల్యూమినియం, పారాబెన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని అప్లై చేసినప్పుడు, అవి తాత్కాలికంగా చెమట నాళాలను అడ్డుకుంటాయి. ఈ అడ్డంకి హార్మోన్ల మార్పులను ప్రేరేపిస్తుందని కొన్ని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి" అని డాక్టర్ సాద్విక్ రఘురామ్ వివరించారు.

డియోడరెంట్లను రొమ్ము కణజాలానికి దగ్గరగా, అండర్ ఆర్మ్ (చంక కింద) ప్రాంతంలో వాడతాం కాబట్టి, ఈ హార్మోన్ల...