Andhrapradesh,guntur, మే 10 -- ఏపీ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో ఓ అధికారిపై సుప్రీంకోర్టు చర్యలకు ఆదేశించింది. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధుల నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమంటే ప్రజాస్వామ్యానికి పునాది అయిన న్యాయవ్యవస్థపై దాడి చేయడం లాంటిదేనని వ్యాఖ్యానించింది.
తాతా మోహన్‌రావు అనే అధికారి 2014లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుడిసెలను తొలగించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించింది. ఈ మేరకు ఆయనపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వలు ఇచ్చింది.
2015లో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను తాతా మోహన్‌రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.