భారతదేశం, జనవరి 16 -- మీరు కొత్త ఏడాదిలో సొంత కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మారుతీ సుజుకీ మీకు అదిరిపోయే వార్త ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ, తన అరీనా నెట్‌వర్క్ ద్వారా విక్రయించే ప్యాసింజర్ కార్లపై ఈ జనవరిలో భారీ ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

మారుతీ సుజుకీ కార్లపై ఈ ఆఫర్లు జనవరి 31 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ భారీ తగ్గింపులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 'జీఎస్టీ 2.0' ధరల కోతతో పాటు కంపెనీ ఇస్తున్న ప్రత్యేక నెలవారీ డిస్కౌంట్లు కూడా కలిసి ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో: అన్నింటికంటే ఎక్కువగా ఎస్-ప్రెస్సోపై రూ. 1,70,100 వరకు బెనిఫిట్స్​ లభిస్తున్నాయి. ఇ...