భారతదేశం, జనవరి 13 -- ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. గత ఏడాది కుప్పంలో పైలట్ గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవల్ని చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లెకు వెళ్లిన సీఎం ఇవాళ స్వగ్రామం సహా తిరుపతిలలో వేర్వేరు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

నారావారిపల్లెలో రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సె...