భారతదేశం, డిసెంబర్ 16 -- వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు UN AIDS ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజీ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా‌తోపాటుగా ఇతర వైద్య నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి సలహా బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

వైద్యారో...