భారతదేశం, జూన్ 16 -- ఈ 8 రోజుల డిజిటల్ డిటాక్స్ చాలా మంది జీవితాలను మార్చివేసింది. మీరు కూడా దీన్ని ఎలా చేయగలరో ఇక్కడ చూడండి. ఈరోజుల్లో నోటిఫికేషన్లు, రీల్స్, బ్రేకింగ్ న్యూస్, రిప్లైలు... ఇలా నిరంతరం మన మెదడును ఉత్తేజపరిచే వాతావరణంలో బతుకుతున్నాం. మన మనసుకి ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరకడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా అనేది ఒకప్పుడు కేవలం ఒక పరికరం మాత్రమే. కానీ ఇప్పుడు అది మనకు తెలియకుండానే ఒక అలవాటుగా, ఒక రిఫ్లెక్స్‌గా మారిపోయింది.

ప్రతిసారి ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు మన మెదడులోని డోపమైన్ అనే రివార్డ్ కెమికల్ యాక్టివేట్ అవుతుంది. మనం నిజంగా ఏమీ సాధించకపోయినా, ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. కాలక్రమేణా, ఈ అలవాటు మన మెదడును ప్రశాంతతకు బదులుగా నిరంతరం ఉత్సాహాన్ని కోరుకునేలా చేస్తుంది. అయితే, డిజిటల్ డిటాక్స్ అంటే టెక్నాలజీని పూర్తిగా వదిలే...