భారతదేశం, జనవరి 23 -- బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ కెరీర్లో మరో అదిపెద్ద డిజాస్టర్ ది రాజా సాబ్. హారర్ కామెడీగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని ప్రభాస్ కు ఓ రికార్డు సాధించిపెట్టింది.

ప్రభాస్ చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీతో ది రాజా సాబ్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైనా.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినా.. నెగటివ్ రివ్యూలతో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొత్తానికి 14వ రోజు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. వీటిలో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.142.08 కోట్లు కాగా.. గ్రాస్ 167.65 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ లో వచ్చిన రూ.34 కోట్లు కలుపుకుంటే...