Telangana,hyderabad, జూలై 24 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రకటించిన మూడు విడత కౌన్సెలింగ్ పూర్తి అయింది. అయితే ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. 64 డిగ్రీ కళాశాలలు సున్నా ప్రవేశాలను నమోదు చేశాయి.

మొత్తం 4.36 లక్షల సీట్లలో దాదాపు 2.94 లక్షలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది భారీగా డిగ్రీ సీట్లు మిగిలిపోయిన పరిస్థితులు ఉనఅనాయి.ఈ నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. స్పెషల్ ఫేజ్ కింద ప్రవేశాలను చేపట్టేందుకు షెడ్యూల్ ను ప్రకటించారు.

జూలై 25 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లుకు అవకాశం కల్పించారు. ఈ గడువు జూలై 31వ తేదీతో పూర్తవుతుంది. ఈ ఫేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 25 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ గడువు కూడా జూలై 31తో ముగుస్తుంది. ఆగస్టు 3వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుందని...