భారతదేశం, మే 22 -- ఇప్పటి వరకు బీటెక్‌ వంటి సాంకేతిక విద్య చదివే వారికే.. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి రెగ్యులర్‌ డిగ్రీలోనూ ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించి సిలబస్‌ రూపొందించే పనిలో ఉన్నత విద్యామండలి నిమగ్నమైంది. సింగిల్‌ మేజర్‌ స్థానంలో డబుల్‌ మేజర్‌ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ విధానం అమలు, సిలబస్‌ రూపకల్పనపై ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ వెంకయ్య ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై మండలి ఛైర్మన్‌ కృష్ణమూర్తి విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు.

డిగ్రీలో తీసుకొస్తున్న మార్పులపై వీసీలకు వివరించి, వారి నుంచి కృష్ణమూర్తి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఉన్నత విద్యలో సంస్కరణల పేర...