భారతదేశం, మే 10 -- ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది మహిళలు జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పొడిబారినట్లుగా మారిపోవడం, చిక్కులు పడి జుట్టు తెగిపోతుండటం, వెంట్రుకల చివర్లలో చిట్లినట్లుగా కనిపించడం చాలా మంది మహిళలల్లో చూస్తున్నాం. ఇంకా చిన్న వయస్సులోనే అమ్మాయిల జుట్టు రాలిపోయి, జుట్టు తెల్లబడి, బట్టతల సమస్యలతో పోరాడుతున్నారు. దీనికి వాతావరణం కూడా ఒక కారణం కావొచ్చు. పొడిగాలి జుట్టును నిర్జీవంగా మార్చడంతో అందం కూడా పాడవుతుంది.

ఇటువంటి జుట్టు సమస్యలను పరిష్కరించడానికి, జుట్టుకు మెరుపు జోడించడం వంటి విషయాలకు టీ నీటిని (డికాషన్‌ను) ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీటిని మీరు ఏయే విధాలుగా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

మీ హెయిర్ కేర్ రొటీన్‌లో డికాషన్‌ను చేర్చడం చాలా సులభం. జుట్టు సంరక్షణకు ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒకవేళ ...