Hyderabad, ఏప్రిల్ 14 -- జ్ఞానం, సమానత్వం, స్వేచ్ఛ - ఇవి కేవలం పదాలు మాత్రమే కాదు. ఒక మహానుభావుడు ఈ విలువల కోసం తన బతుకంతా పోరాడాడు. వీటికోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, అసాధారణంగా జీవించి, అసమాన్యంగా భారతదేశ చరిత్రను మలిచిన నేత అంబేద్కర్.అణగారిన వర్గాలకు స్వరమవుతూ, చదువు ద్వారా చైతన్యాన్ని, రాజ్యాంగం ద్వారా హక్కులను, బౌద్ధ ధర్మం ద్వారా మానవత్వాన్ని అందించిన మహానాయకుడు.

ఆయన నాయకత్వం లేకపోతే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛలు, సమానతలు, హక్కులు ఇంత బలంగా ఉండేవి కావేమో. ఇలాంటి మహానుభావుడిని ఏప్రిల్ 14న ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత, ఆయనకిచ్చే గౌరవం కూడా. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలన...