భారతదేశం, నవంబర్ 6 -- డాలర్ బలహీనత కారణంగా గురువారం (నవంబర్ 6) ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. అయితే, ఊహించినదానికంటే మెరుగైన అమెరికన్ ఉద్యోగ గణాంకాలు రావడంతో.. ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు తగ్గాయి. దీంతో పసిడి లాభాలకు బ్రేక్ పడింది.

ఉదయం 9:15 గంటల ప్రాంతంలో, MCX లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం పెరిగి 10 గ్రాములకు Rs.1,20,687 వద్ద ఉంది. అదే సమయంలో, డిసెంబర్ సిల్వర్ కాంట్రాక్టులు 0.06 శాతం వృద్ధితో కిలోకు Rs.1,47,411 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

డాలర్ సూచీ (Dollar Index) దాదాపు 0.20 శాతం తగ్గినా, 100 మార్కు పైననే కొనసాగుతోంది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయికి కొద్దిగా దిగువన ఉండడం గమనార్హం. అదేవిధంగా, యూఎస్ 10-సంవత్సరాల బాండ్ దిగుబడి (Bond Yields) కూడా దాదాపు నెల రోజుల గరిష్ట స్థాయికి కొద్దిగా దూరంలో ...