Hyderabad, మే 18 -- వేసవి సెలవుల్లో చల్లని డార్జిలింగ్‌కు వెళ్లాలని ఎంతో మంది ప్లాన్ చేస్తారు. అందమైన ప్రదేశాల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడపాలని కోరుకుంటారు. మీరు కూడా వేసవి సెలవుల్లో మీ పిల్లలను చూడటానికి మంచి ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే డార్జిలింగ్ వెళ్ళండి. ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు ఎన్నో పచ్చని ప్రదేశాలలో ఎంజాయ్ చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబంతో కలిసి ఆస్వాదించవచ్చు. డార్జిలింగ్ లో సందర్శించవలసిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

డార్జిలింగ్ లో చూడదగిన ప్రదేశాలలో ఇది ఒకటి. రెండు అడుగుల వెడల్పున ఉండే నారో గేజ్ రైలు ట్రాక్. న్యూ జల్పాయిగురి నుంచి డార్జిలింగ్ మధ్య దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ ట్రాక్ టాయ్ రైలుకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ప్రయాణిస్తూ మీరు లోయలోని అందమైన దృశ్యాలను చూడవచ్చు.

కాంచన్ జంగా పర్వతంపై అద్భుతమైన సూర్యోదయాన్న...