భారతదేశం, నవంబర్ 4 -- తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్ పార్టీ కలకలం రేపింది. ఇటీవల డ్రగ్ పార్టీలపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రెండు ప్రదేశాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. ఓ వైద్యుడు ఇంట్లో భారీగా డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. మరోవైపు గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని భగ్నం చేశారు.

ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్ అనే వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అతడి నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ ఉన్నట్టుగా గుర్తించి సీజ్ చేశారు. జాన్‌పాల్‌ను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో మరో ముగ్గురి మీద కూడా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ ఢిల్లీ, బైంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నారు. వైద్యుడి ఇంట్లో పెట్టి అమ్ముతు...