Hyderabad, ఏప్రిల్ 17 -- డయాబెటిస్ లేదా మధుమేహం ఉన్నవారు మీకు నచ్చిన లేదా రుచికరమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. కరెక్ట్ ఫుడ్ ప్లానింగ్ ఫాలో అయితే మీరు బ్లడ్ షుగర్‌ని నియంత్రించగలరు. దాంతోపాటు బరువు కూడా తగ్గించుకోవచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇప్పుడు మధుమేహాన్ని అదుపులో ఉంచగలిగే ఫుడ్ ప్లాన్ ఏంటో చూద్దాం.

ఫ్యాట్ ఉండటం కూడా శరీరానికి మంచిదే. కానీ, అది గుడ్ ఫ్యాట్ అయి ఉండాలి. అటువంటి గుడ్ ఫ్యాట్ ఆవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్, చేపలలో (సాల్మన్, మాకరెల్) మెండుగా ఉంటుంది.

మీ ప్లేట్‌లో..

ఎంత తింటున్నారనేది ఏం తినాలో కంటే ముఖ్యం. మోతాదును జాగ్రత్తగా పట్టించుకోవాలి. దీని కోసం కప్పుల కొలతలు ఉపయోగిస్తే సులువుగా ఉంటుంది.

మీ శరీరానికి తగినంత నీరు ఇవ్...