Hyderabad, ఏప్రిల్ 11 -- ఇప్పుడు డయాబెటిస్ కేవలం పెద్ద వయసు వారికే రావాలని లేదు. ఏ వయసులో ఉన్నవారికైనా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వంటివన్నీ కూడా డయాబెటిస్ చాలా చిన్న వయసులోనే వచ్చేలా చేస్తున్నాయి. ఎంతో మందికి డయాబెటిస్ లక్షణాలు గురించి తెలియదు. అలాగే డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవడం పై అవగాహన కూడా లేదు.

సమస్య వచ్చాక పరీక్షలు చేయించుకునే బదులు ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకుంటే దాని రాకను అరికట్టవచ్చు. అలాగే ప్రాథమిక దశలోనే డయాబెటిస్ ను గుర్తించవచ్చు వ్యాధి. ముదిరిపోయాక పరీక్షలు చేయించుకునే కన్నా ప్రతి ఏడాది రెండుసార్లు డయాబెటిస్ టెస్టులు చేయించుకోవడం వల్ల మీరు ముందే దాని బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

డయాబెటిస్ ఎప్పుడూ అకస్మాత్తుగా వచ్చి పడదు. రోజులు నెలలు సంవత్సరాల సమయాన్ని తీసుకొని శరీరంలోకి ప్...