భారతదేశం, జనవరి 16 -- మనం ఎన్ని రకాల పిండి వంటలు తిన్నా, చివరికి ఆ కాస్త అన్నం కడుపులో పడితే ఆ తృప్తే వేరు. కానీ, ఇంట్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే చాలు.. అన్నం పేరు ఎత్తితేనే భయం వేస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్నం ప్రధాన ఆహారం కాబట్టి, దాన్ని పూర్తిగా మానేయడం చాలా కష్టం. అయితే, తెల్ల అన్నం (White Rice) వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయన్నది చేదు నిజం.

మరి దీనికి పరిష్కారం లేదా? అంటే.. ఖచ్చితంగా ఉందని అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు కరిష్మా చావ్లా. తెల్ల అన్నానికి బదులుగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న కొన్ని రకాల బియ్యాన్ని మన డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆమె వివరిస్తున్నారు.

మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థాలు (Carbohydrates) ఎంత వేగంగా రక్తంలో చక్కెరగా మారుతాయో ...