Hyderabad, ఏప్రిల్ 25 -- డయాబెటిస్‌తో జీవించడం ఒక నిరంతర పోరాటంలా అనిపిస్తుందా? రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదా? అయితే మీ దృష్టిని మరల్చాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి! మీ శరీరంలోనే దాగి ఉన్న ఒక శక్తివంతమైన వ్యవస్థ డయాబెటిస్‌ను నిర్వహించడంలో మీరు ఊహించని సహాయం చేయగలదు. అదే జీర్ణవ్యవస్థ.

అవును..డయాబెటిక్ ఫుడ్, మందులు మాత్రమే కాకుండా, మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా మీరు మరింత ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలరు. అదెలా అనుకుంటున్నారా?డయాబెటిస్ నిర్వహణలో మీ జీర్ణవ్యవస్థ ఎలాంటి పాత్ర పోషిస్తుందో, దాన్ని మెరుగుపరచడానికి మీరు ఏమి చేయాలో తెలుసుకుందాం రండి!

మధుమేహ నిర్వహణలో జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా అందులోని గట్ మైక్రోబయోమ్ (పేగులోని సూక్ష్మజీవుల సమూహం) కీలకమైన పాత్ర పోషిస్తుందన...