Hyderabad, మే 1 -- డయాబెటిస్, హై బీపీ ఈ రెండూ కూడా ప్రపంచంలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. కొంతమందిలో హై బీపీ, డయాబెటిస్ రెండూ జంటగా ప్రయాణం చేస్తున్నాయి.

అయితే కొంతమందిలో డయాబెటిస్ ఉంటే హైబీపీ వస్తుందా? లేక అధిక రక్తపోటు ఉన్నవారికి డయాబెటిస్ వస్తుందా? అనే సందేహం ఉంది. నిజానికి ఈ రెండూ కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు తరచుగా కలిసే వస్తాయి.

డయాబెటిస్, అధికరక్తపోటు. ఈ రెండూ కలిసి వచ్చి గుండె జబ్బుల సమస్యను కూడా పెంచేస్తాయి. డయాబెటిస్ అనేది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. అలాగే అధిక రక్తపోటు అనేది డయాబెటిస్ అదుపులో ఉండకుండా అడ్డుకుంటుంది. అందుకే ఈ రెండూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిస్ ఉన్నవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి తరచుగా ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల వారి కణ...