Hyderabad, ఏప్రిల్ 15 -- డయాబెటిక్ న్యూరోపతి అనేది డయాబెటిస్ ఉన్న రోగులను ప్రభావితం చేసే ఒక నరాల వ్యాధి. డయాబెటిస్ ఉన్నవారు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ డయాబెటిక్ న్యూరోపతి బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎవరైతే అధిక బరువుతో బాధపడతారో వారు ఈ డయాబెటిక్ న్యూరోపతి బారిన పడే అవకాశం ఎక్కువ.

అధిక రక్తపోటు ఉన్న వారు, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు, మూత్రపిండా వ్యాధులతో ఉన్నవారు, మద్యం తాగేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారికి డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో ఉన్న కొన్ని జన్యువులు కూడా డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.

డయాబెటిస్ అదుపులో ఉండనప్పుడు అంటే రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోజ్ ఉన్నప్పుడు, ట్రై గ్లిజరైడ్స్ వంటి అధిక కొవ్వు స్థాయిలు ఉన్నప్పుడు నరాలు ...