భారతదేశం, జూన్ 11 -- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ కు అర్హత సాధించకపోయినప్పటికీ టీమ్ఇండియా గత రెండు ఎడిషన్ల విన్నర్లు న్యూజిలాండ్ (2021), ఆస్ట్రేలియా (2025)తో సమానంగా సంపాదిస్తుంది. డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీని 3.6 మిలియన్ డాలర్లకు పెంచుతూ ఐసీసీ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యమైంది. గత రెండు ఎడిషన్లలో రన్నరప్ గా నిలిచిన భారత్ 2023-25 సీజన్లో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో హ్యాట్రిక్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నెం.1, నెం.2 స్థానాల్లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు నేడు (జూన్ 11) లార్డ్స్ లో ప్రారంభమైన ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో విజేతలకు 3.6 మిలియన్ డాలర్లు లభిస్తాయి. ఇది న్యూజిలాండ్ (2021), ఆస్ట్రేలియా (2023) గత రెండు ఫైనల్స్ గెలిచి...