భారతదేశం, డిసెంబర్ 5 -- నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా స్పందించాడు. సైక్ సిద్ధార్థ మూవీకి ప్రెజెంటర్ గా ఉన్న అతడు.. ప్రెస్ మీట్ లో వివిధ అంశాలపై మాట్లాడాడు. అఖండ 2 ఇష్యూ త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు.

సైక్ సిద్ధార్థ మూవీ ప్రమోషన్లలో భాగంగా మూవీ సమర్పకుడిగా ఉన్న సురేష్ బాబు శుక్రవారం (డిసెంబర్ 5) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అఖండ 2 రిలీజ్ వాయిదా గురించి రిపోర్టర్లు అతన్ని ప్రశ్నించారు. దీనిపై సురేష్ బాబు స్పందిస్తూ.. ఆర్థిక విషయాలు పబ్లిగ్గా చర్చించాల్సిన అవసరం లేదని అన్నాడు.

"ఆ విషయం గురించి మాట్లాడటం వల్లే రావడం ఆలస్యమైంది. అది పరిష్కారమవుతుంది. అయినా అవన్నీ ఆర్థిక విషయాలు. వాటి గుర...