భారతదేశం, జూన్ 8 -- డబ్బు సంపాదించడం అంతా తేలికైన విషయం కాదు. ఈ డిజిటల్ యుగంలో ఉన్న డబ్బును కాపాడుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్. డబ్బు ఊరికే మంచులా కరిగిపోతుంది. అంటే ఖర్చు అయిపోతుంది. ఎలా అయిపోతుందో కూడా మీకు తెలియదు. పెట్టుబడి పెట్టడానికి మార్గాలను వెతకాలి. కానీ అందులోనూ తెలిసి తెలియక తప్పులు చేయకూడదు. కొన్ని తప్పుల వల్ల డబ్బు వృథా అవుతుంది. మళ్లీ సున్నా నుంచి మెుదలుపెట్టాలి. మీకు ఈ కింది ఎగ్జాంపుల్స్ ఉపయోగపడతాయి చదవండి..

మహేంద్ర వయస్సు 29 తనకు జీతం వస్తుంది కదా అని.. జీరో వడ్డీ ఈఎంఐ ప్లాన్‌లతో అనేక వస్తువులను కొనుగోలు చేశాడు. కారు, మొబైల్, టీవీ ఇలా మొదలైనవి. కానీ అతడు అనుకోకుండా ఉద్యోగం కోల్పోయాడు. ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా క్రెడిట్ స్కోరు దెబ్బతింది. కొత్త ఉద్యోగం పొందిన తర్వాత హోమ్ లోన్ కోసం అప్లై చేస్తే.. తిరస్కరించార...