Hyderabad, ఏప్రిల్ 12 -- కష్టాలలో, సుఖాలలో తోడుంటామని ఒకరికొకరు ప్రమాణం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుంటారు. ఆ తర్వాత కొందరు కుటుంబానికి ఎంతో కీలకమైన ఆర్థికపరమైన నిర్ణయాలను ఒక్కరే తీసుకుంటుంటారు. ఇది తామొక్కరమే సంపాదిస్తున్నామనే ఆలోచనతోనో లేదంటే తమ భాగస్వామికి తెలియకూడదనో ఇటువంటి ఆలోచనలు చేస్తుంటారు. మరికొందరు ఇద్దరూ సంపాదించే వారైనా కూడా ఎవరి ఆలోచనలు వారిగా ఉండి ఫ్యూచర్ ప్లానింగ్ సరిగా చేసుకోరు. వాస్తవానికి ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలే బలంగా ఉంటాయట. ఇలా సక్సెస్ అయిన జంటను మీరు చాలా చోట్ల చూడొచ్చు కూడా.

సంతోషం, దుఃఖాన్ని పంచుకున్నప్పుడు, జీవితాన్ని కలిసి ప్రణాళిక చేసుకున్నప్పుడు, ఆర్థిక ప్రణాళికలు కూడా కలిసి ఉండాలి. దీనికి, మీ ఆర్థిక ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం కూడా అవసరం. మీరు ఏదైనా ఆస్తి అంటే ఇల్లు కొనాలనుకుంటున్నారా? లేద...