భారతదేశం, మే 17 -- ఒడిశాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది! కొన్నేళ్ల క్రితం అనాథగా కనిపించిన పసికందును ఆదరించి పెంచుకుంటున్న ఓ మహిళను, ఆ శిశువు పెద్ద అయ్యి మరో ఇద్దరితో కలిసి చంపేసింది! మహిళ ఆస్తిని దక్కించుకునేందుకు ఈ నేరానికి పాల్పడటం గమనార్హం.

ఒడిశా గజపతి జిల్లాలో జరిగింది ఈ ఘటన. రాజలక్ష్మి అనే మహిళ, భువనేశ్వర్​లో కొన్నేళ్ల క్రితం ఓ అనాథ పసికందును చూసింది. ఆ శిశువును ఆమె ఆదరించి, పెంచుకోవడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత ఆ బాలికకు పరలఖెముండిలోని కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్​ వచ్చింది. ఆ బాలిక కోసం రాజలక్ష్మి అన్ని వదులుకుని సమీపం ప్రాంతంలోను అద్దె ఇంటికి షిఫ్ట్​ అయ్యింది.

ప్రస్తుతం ఆ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. కాగా ఇటీవలి కాలంలో ఆమెకు గణేశ్​ రథ్​, దినేశ్​ సాహు అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇది రాజలక్ష్మికి తెలిసి, బాలి...