Hyderabad, జూన్ 11 -- నితిన్ నటించిన తమ్ముడు మూవీ ట్రైలర్ బుధవారం (జూన్ 11) లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ తమ్ముడు మూవీ టికెట్ల ధరలను పెంచబోమని, అంతేకాదు ఈ ట్రైలర్ కు వచ్చే వ్యూస్ పూర్తిగా ఒరిజినల్ అని అతడు చెప్పడం గమనార్హం.

ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. యూట్యూబ్ లో రికార్డులంటూ చెప్పడం సాధారణమైపోయింది. అయితే అందులో చాలా వరకు పెయిడ్ వ్యూసే ఉంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఇక నుంచి తన సినిమాలకు మాత్రం అలాంటివి వద్దని తన పీఆర్ టీమ్ కు కచ్చితంగా చెప్పినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతడు ఈ కామెంట్స్ చేశాడు.

ఈ సినిమా నుంచే దీనిని మొదలు పెడుతున్నామని చెప్పాడు. డబ్బులిచ్చి వ్యూస్ కొనడం వల్ల అసలు కంటెంట్ ప్రేక్షకులకు ఎంత వ...