Hyderabad, సెప్టెంబర్ 8 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. అయితే మనకు మొత్తం 12 రాశులు ఉంటాయి. ఒక్కో రాశి వారి ప్రవర్తన, తీరు ఒక్క విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు డబ్బుకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. ఎవరు న్యాయంగా, ధర్మంగా ఉంటారు? పొరపాటున కూడా తప్పు చేయరు? ఎంతో నిజాయితీగా ఉంటారు? డబ్బులు ఇస్తామన్నా తప్పు చెయ్యరు. అలాంటి రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి డబ్బు బాగా సంపాదించాలని ఉంటుంది. ఎప్పుడూ డబ్బుల కోసం పరిగెడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అసలు డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వరు. నిజానికి వీరికి న్యాయం, ప్రేమ, నైతికత, నిజాయితీ వంటివే ముఖ్యమని భావిస్తారు. డబ్బు వచ్చినా, రాకపోయినా పర్వ...