భారతదేశం, జూన్ 16 -- హైదరాబాద్: తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో, లబ్ధిదారులే ఆ ఇళ్లను పూర్తి చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా, సొంత స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్...