భారతదేశం, జనవరి 6 -- మొబైల్ ప్రియులకు షావోమీ అదిరిపోయే కొత్త ఏడాది కానుకను అందించింది. భారత మార్కెట్​లోకి తన మోస్ట్ అవేటెడ్ 'రెడ్‌మీ నోట్ 15 5జీ' స్మార్ట్‌ఫోన్‌తో పాటు శక్తివంతమైన 'రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో' ట్యాబ్లెట్‌ను మంగళవారం విడుదల చేసింది. మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, క్వాల్కమ్ లేటెస్ట్ చిప్‌సెట్‌లతో వీటిని రూపొందించింది సంస్థ. ఈనేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

షావోమీ తన ఐకానిక్ నోట్ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ పర్ఫార్మెన్స్‌లో దుమ్మురేపుతోంది! ఈ రెడ్​మీ నోట్​ 15 స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 30శాతం మెరుగైన సీపీయూ పర్ఫార్మెన్స్‌ను, 10 శాతం మెరుగైన గ్రాఫిక్స్‌ను అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

హైప...