భారతదేశం, మే 4 -- యూట్యూబ్‍లో ఫ్రీగా సినిమాలు చూసేందుకు చాలా మంది వెతికేస్తుంటారు. ఏ సినిమా చూడాలో ఆలోచిస్తుంటారు. కొన్ని మలయాళ చిత్రాలు.. తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫ్రీగా చేయవచ్చు. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో 'ది హిట్ లిస్ట్' ఒకటి. మలయాళ మూవీ వెట్టా (Vettah) తెలుగు డబ్బింగ్‍లో ది హిట్ లిస్ట్ పేరుతో వచ్చింది. ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం యూట్యూబ్‍లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..

ది హిట్ లిస్ట్ చిత్రంలో కుంచకో బోబన్, కాదల్ సంధ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఈ సినిమా యూట్యూబ్‍లో భవానీహెచ్‍డీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‍లో అందుబాటులో ఉంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

ఈ సమ్మర్‌లో ఖాళీగా ఉన్న టైమ్‍లో మలయాళ థ...