భారతదేశం, జూలై 12 -- ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ భారతదేశంలోని తన యూజర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్​ రేట్లను గణనీయంగా తగ్గించింది. అధికారిక పోర్టల్‌లో ఇచ్చిన అప్‌డేట్స్ ప్రకారం.. అన్ని అకౌంట్ టైర్‌లలో నెలవారీ, వార్షిక రుసుములను ఏకంగా 48 శాతం వరకు తగ్గించింది!

ఎక్స్​ (ట్విట్టర్​) మొబైల్ యాప్ యూజర్ల కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలో భారీ తగ్గింపు కనిపించింది. ఇదివరకు నెలకు రూ. 900 ఉన్న ఈ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం రూ. 470కి లభిస్తుండటం విశేషం! ఇది 48 శాతం తగ్గింపు. వెరిఫికేషన్ చెక్‌మార్క్, ఇతర ప్రత్యేక ఫీచర్లను అందించే ప్రీమియం టైర్, వెబ్ బ్రౌజర్‌లలో కూడా చౌకగా లభిస్తోంది. వెబ్‌లో నెలవారీ రుసుము రూ. 650 నుంచి రూ. 427కి తగ్గించింది ఎక్స్​. ఇది 34 శాతం తగ్గింపు.

"మొబైల్- వెబ్ ధరల మధ్య ఈ వ్యత్యాసానికి కార...