Hyderabad, జూలై 25 -- జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన 'వార్ 2' మూవీతో ఈ టాలీవుడ్ స్టార్ బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాలో హృతిక్ రోషన్, కియారా అద్వానీలతో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ఇందులో అతడు ఇండియన్ ఏజెంట్ విక్రమ్‌గా, హృతిక్ కబీర్‌కు ప్రత్యర్థిగా కనిపించనున్నాడు. శుక్రవారం (జులై 25) 'వార్ 2' ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో ప్రదర్శించగా, వందలాది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. వారి ఉత్సాహం, స్పందన చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రంపై అభిమానులు పండగ చేసుకునే మూడ్‌లో ఉన్నారు. సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. అయితే కేవలం ట్రైలర్ చూడటానికి థియేటర్లకు పోటెత్తారు. ఎక్స్ లో పోస్ట్ ...