భారతదేశం, డిసెంబర్ 17 -- రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి ట్రైనింగ్ ప్రక్రియ మొదలుకాబోతుంది. మంగళవారం ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపి కబురు చెప్పారు.

శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500 కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి వేదికపైనే ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.4500 నుంచి వారికి స్టైఫండ్ ను ఒక్కసారిగా రూ.12,500 కు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ట్రైనీ కానిస్టేబుళ్లు కేరింతలు కొట్టారు.

పోలీసు శాఖలో ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ...