భారతదేశం, అక్టోబర్ 29 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 151 పాయింట్లు పడి 84,628 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 100 పాయింట్లు పెరిగి 58,214 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 636.30 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,060.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"26,000 దాటితే నిఫ్టీ50లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. 26,300 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. 25,850 వద్ద కీలక సపోర్ట్​ ఉంది," అని ఎల్​కేప...