భారతదేశం, ఆగస్టు 11 -- ప్రభాస్ పెళ్లెప్పుడు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే దాని కంటే పెద్ద ప్రశ్న ఇది. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడో అనే దానికి సమాధానం దొరికింది. కానీ ప్రభాస్ కల్యాణ ఘడియలు మాత్రం ఇంకా రాలేదు. అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలా దేవి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందన్నారు. శ్రావణమాసం నేపథ్యంలో ద్రాక్షారామంలోని భీమ లింగేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి శ్యామలా దేవి సందర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని చెప్పారు.

''ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. పూజలు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ...