భారతదేశం, జూన్ 9 -- డిఫరెంట్ కాన్సెస్ట్ తో వస్తున్న సినిమాలు ఓటీటీని ఏలుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్ మూవీస్ తదితర జోనర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ కన్నడ మూవీ జీ5లో అదరగొడుతోంది. నంబర్ వన్ గా ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న ఆ మూవీనే 'అజ్ఞాత‌వాసి'. దీంతో పాటు జీ5 ఓటీటీలో టాప్-5లో ఉన్న మూవీస్ ఏంటో చూసేయండి.

అజ్ఞాత‌వాసి మూవీ మర్డర్ మిస్టరీ డ్రామాగా సాగుతోంది. ఈ కన్నడ సినిమా ఏప్రిల్ 11, 2025న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూస్ దూసుకెళ్లింది. మే 28న జీ5 ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. 25 ఏళ్లుగా క్రైమ్ అన్నదే లేని ఓ ఊర్లో అనూహ్యంగా మర్డర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. ఆ మర్డర్ ఎవరు చేశారు? అనే మిస్టరీ థ్రిల్లర్ గా సాగుతున్న అజ్ఞాత‌వాసి మూవీ ఆడియన్స్ ను అలరిస్తోంద...