భారతదేశం, జూన్ 12 -- ఓటీటీ అంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, సిరీస్ లకు పెట్టింది పేరు. విభిన్నమైన సినిమాలు ఓటీటీని ఏలుతున్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, తండ్రీకొడుకుల మధ్య అనుబంధంతో వచ్చిన అనగనగా సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఈటీవీ విన్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఈ ఓటీటీలో టాప్-5 మూవీస్ లో రెండు కామెడీ సినిమాలున్నాయి. ఆ సినిమాలు ఏంటో చూసేయండి.

తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ ను మాటల్లో వర్ణించలేం. ఇక ఆ తండ్రి చనిపోతున్నానని తెలిసి.. తాను లేకపోయినా తనయుడిలో ధైర్యాన్ని నింపాలని చేసే ప్రయత్నం కచ్చితంగా మనసును కదిలిస్తుంది. అలా కదిలించే మూవీనే అనగనగా. చాలా కాలం తర్వాత సుమంత్ ను ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా ఇది.

మే 15న నేరుగా ఓటీటీ లోకి రిలీజైన ఈ మూవీలో విద్యావ్యవస్థలోని లోపాలు, మార్కులు.. ర్యాంకులతో చిన్నారుల ఒత్తిడిలోకి నెట్టే ...