భారతదేశం, జూన్ 15 -- అత్యవసర ఖర్చుల కోసం లేదా అదనపు ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం సర్వసాధారణం. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు పర్సనల్ లోన్‌పై ఆధారపడటం చాలామందికి తెలిసిన విషయమే. కొన్నిసార్లు ఇంటి మరమ్మతుల కోసం లేదా ఇంకేదైనా అవసరం నిమిత్తం ప్రజలు వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు.

అయితే, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం కూడా చాలామంది అప్పులు చేస్తుంటారు. ఇలా ప్రతి విషయానికి అప్పు చేస్తూ వెళితే ఎలా? ఎక్కడ ఆగుతాము? పైగా, ఇటీవలి కాలంలో ట్రావెలింగ్​ కోసం కూడా పర్సనల్​ లోన్​ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం ట్రావెలింగ్​ కోసం అప్పు చేయడం సరైనదేనా? "ఎప్పటికి కాదు" అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణం వంటి విచక్షణతో కూడిన (అంటే తప్పనిసరి కాని) ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని...