భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. పదే పదే ఉల్లంఘనలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే పాయింట్స్ సిస్టమ్‌ను కఠినంగా అమలు చేయడానికి అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవస్థ కొంతకాలంగా అమలులో ఉన్నప్పటికీ చర్యలు పెద్గగా తీసుకున్నట్టుగా కనిపించ లేదు.

ఇప్పుడు ఈ విషయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. పోలీసు, రవాణా శాఖలు డేటా భాగస్వామ్యం, సకాలంలో చర్య తీసుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ రెండు విభాగాలు సాంకేతిక సమన్వయాన్ని బలోపేతం చేయాలని అనుకుంటున్నాయి.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలే ఎక్కువ ప్రాణాలను బలిగొంటున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను అరికట్టడాన...