భారతదేశం, డిసెంబర్ 26 -- ఒక్క చిన్న అజాగ్రత్త.. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును ఆవిరి చేస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వచ్చిన ఒక మెసేజ్, ఒక వ్యక్తికి ఏకంగా Rs.6 లక్షల నష్టాన్ని మిగిల్చింది. కేవలం Rs.500 ఫైన్ కట్టబోయి ఇంత భారీ మొత్తాన్ని పోగొట్టుకున్న ఈ ఉదంతం ఇప్పుడు వాహనదారులను కలవరపెడుతోంది.

సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడికి తన వాహనంపై ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి చలానా పడిందని, వెంటనే చెల్లించాలంటూ ఒక ఎస్ఎంఎస్ (SMS) వచ్చింది. అందులో ఒక లింక్ కూడా ఉంది. అది ప్రభుత్వ విభాగం నుంచి వచ్చిన మెసేజ్ అని నమ్మిన ఆ వ్యక్తి, ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. అది నేరుగా ప్రభుత్వ పోర్టల్‌ను పోలి ఉన్న ఒక నకిలీ వెబ్‌పేజీకి తీసుకెళ్లింది. అక్కడ తన బ్యాంకింగ్ వివరాలు ఎంటర్ చేయగానే, సైబర్ కేటుగాళ్లు అతని ఫోన్‌పై నియంత్రణ సాధించారు. ...