భారతదేశం, నవంబర్ 6 -- హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక ప్రాజెక్టు చేపట్టింది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు ఆరు లేన్ల డబుల్ సైడ్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. హఫీజ్‌పేట్ నుండి మియాపూర్ వరకు ఒకటి, బాచుపల్లి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు మరో రెండు మూడు లేన్ల అండర్‌పాస్‌లను నిర్మించే ప్రక్రియను కూడా జీహెచ్‌ఎంసీ మెుదలుపెట్టింది.

ఈ ప్రాజెక్ట్ ఐటీ కారిడార్లు, గచ్చిబౌలి, మియాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. మియాపూర్-ఆల్విన్ మధ్య అత్యంత ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. పెరుగుతున్న జనాభా, పనులకు వెళ్లేవారితో ఈ సమస్య అవుతుంది

ఈ ...