భారతదేశం, ఆగస్టు 21 -- అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచింది. మెుదట 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకుగానూ మరో 25 శాతం పెంచింది. దీంతో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించినట్టైంది. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ గతంలో ప్రకటించారు.

ఓవైపు ట్రంప్ సుంకాల వివాదం మధ్య భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక పెద్ద అడుగు వేశారు. రష్యాతో వాణిజ్యాన్ని పెంచడంపై నొక్కి చెబుతూ ఆయన రష్యన్ కంపెనీలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారత కంపెనీలతో సహకారాన్ని పెంచుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యన్ కంపెనీలను ప్రోత్సహించారు. రష్యన్ కంపెనీలకు సందేశం ఇస్తూనే, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, 'మేక్ ఇన్ ఇండియా', ఆత్మనిర్భర్ భారత్ వంటి అభివృద్ధ...