భారతదేశం, ఆగస్టు 28 -- అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించింది. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారతదేశం ప్రధాన ఎగుమతి దేశాలలో అమెరికా ఒకటి. ఈ నిర్ణయం భారతదేశానికి ఆందోళన కలిగించేదిగా మారింది. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రపంచ మార్కెట్లో దుస్తుల ఎగుమతిని ప్రోత్సహించాలని ప్రణాళిక వేసింది.

ఇప్పుడు 40 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది. యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాలాంటి దేశాలు ఇందులో ఉన్నాయి. ఈ దేశాల్లో విశ్వసనీయమైన, నాణ్యమైన, అత్యాధునిక టెక్స్ టైల్ ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్ నిలవాలనుకుంటోంది. వస్త్ర...