భారతదేశం, జనవరి 27 -- అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ట్రంప్ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేసిన కొలంబియా ఇప్పుడు ట్రంప్ షరతులన్నింటినీ అంగీకరించేందుకు సిద్ధమైంది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దక్షిణ అమెరికా దేశం యూ టర్న్ తీసుకుంది. అక్రమ వలసదారులకు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన అన్ని షరతులను అంగీకరించిందని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

అధ్యక్షుడు ట్రంప్ షరతులకు కొలంబియా ప్రభుత్వం అంగీకరించిందని వైట్ హౌస్ తరఫున ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన అక్రమ వలసదారులందరినీ కొలంబియా అంగీకరించడం కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది.

కొలంబియా విదేశాంగ మంత్రి లూయిస్ గిల్బెర్టో...