భారతదేశం, జూన్ 11 -- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సయోధ్యకు టెస్లా సీఈవో మస్క్ ప్రయత్నాలు చేేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ తో సంబంధాలు దారుణంగా పతనమై, అవి తన వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, నష్ట నివారణ చర్యలను మస్క్ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గతవారం తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు. ''గత వారం ప్రెసిడెంట్ @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్టులకు చింతిస్తున్నాను. అవి చాలా దూరం వెళ్లాయి'' అని ఎలన్ మస్క్ తాజాగా ఒక ఎక్స్ పోస్ట్ లో రాశారు.

అంతకుముందు, మస్క్ "తీవ్రమైన పరిణామాలు" ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ''రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ మద్దతు ఉన్న రిపబ్లికన్లకు వ్యతిరేకంగా పోటీ చేసే అభ్యర్థులకు మస్క్ మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తె...